భృంగరాజ మహిమము

దాసు శ్రీరాములు (1846–1908)

శ్లో॥ ఆదిశక్తి స్వరూపాంచ | నిర్జరావనతత్పరామ్ఆరోగ్యదాయినీంవందే | భామరీంలోకపోషణీమ్||

భృంగరాజ స్తవము

శ్లో॥ భ్రామరీపద సంభూతం గంగాతటనివాసినంభృంగరాజం నమామ్యద్య | సర్వరోగనివారణం||

ఆదినాధస్తవము

శ్లో॥ ఆదినాధం మహాసిద్ధం | చంపకారణ్యవాసినంలోకసంచారిణం సాధుం | మహావైద్యవిశారదం||

తే.గీ.యందుసిందూరమును గల్పియంతసేపుమర్దనముచేసి గుంజాప్రమాణమయినమాత్రలను దిన జ్వరములు మానువేగననుచు సిద్ధుడు వచియించె అద్భుతముగ.

గుంటగలగరచెట్టు సమూలముదెచ్చి చిల్లులులేని కుండకువాసెనగట్టి దాని మీదనుంచి శొంతి పిప్పళ్ళు మిరియాలపొడిబాగుగావై చి మూకుడుతో గట్టిగా మూసి మధ్యాగ్నిచే నొకజామువండి బయటకుదీసి గుంటగలగరాకు రసముతో ఖల్వాన జామునూరి గురిగింజలంత మాత్రలు చేసి పుచ్చుకొనిన యెడల జ్వరములు మానును.

అంత నవనాధుండు భృంగరాజం జండళూలాదుల కుపయోగించు విధంబుపదేశింపవే యని యడిగిన నతండు.

తే.గీ.కండచక్కెర మిరియాలు గలయనూరిగుంటగల్గర పసరులో గూర్చి కల్పిమూడుతులముల యెత్తును మొనసిత్రాగనండశూలలు మూనాళ్ళ కడగిపోవు

పంచదార మిరియాలు బాగా సూరి గుంటగలగరాకు పసరులో కలిపి మూడేసి తులాల చొప్పున పుచ్చుకొనవలయును.వృషణాది (అండవాతము) శూలలు మానును.

సీ. అండశూలలనెల్ల ఖండించు విధమునుతాల్మితో నుడివెద దనరవినుము

భృంగరాజంబున బేర్మిరసము దీసికటుకరోహిణినందు గలయ నూరితేనెను దానిలో దెల్లంబుగా నుంచితర్వాత నార్ద్రవస్త్రమున రాచిఅండదేశము చుట్టి కొండొక సేవుంచిపండునిప్పులమీద బరగ గాచి

తే.గీ.మూడుదినముల నీరితి మొనసిచేయవాపడంగును శమియించు వడిగ శూలసుఖముగానుండు సండముల్ శుద్ధములగుననుచు సిద్ధుండు వచియించే నద్భుతముగ.

కటుకరోహిణి గుంటగలగరాకు రసముతో నూరి తేనెలోరంగరించి తడిబట్టకు పూసి అండముల మీద వైచి పండునిప్పులమీద కొంత సేపు కాచుచుండవలెను. మూడు దినములీలాగునజేయగా వాపుతీసి నొప్పి శమించును.

క.వెలిగారము పొంగించియుకలిలోసన్ భృంగరసము కల్పియు వేగన్తెలుపగు ఫేవముతోడన్సలువుగ ద్రావింప శూల నటనలడంచున్

తే.గీ.ఆరతులము కట్కరోహిణి సరగసూరిమిరియముల చూర్ణమును దానమెళగించినాల్గుతులముల పసరులో నల్ని కల్పిరోగికిచ్చిన శూలలు డాగిపోవె

అరతులము కటుకరోహిణి అంతే మిరియాల చూర్ణముతోకలిపి నాల్గుతులముల గుంటగలగర పసరులో బాగుగా గలిపిపుచ్చుకొన్న యెడల శూలలు హరించును.

తే.గీ.భృంగరాజపు కొనలను సంగతముగతురగసంఖ్యను గొనితెచ్చి పరగజేర్పియేడు మిరియాలతో మూడునాడులు దినచురుకు రోగంబులు దొలగి సుఖమునిచ్చు

గుంటగలగరాకులు ఏడుకొనలతోనున్నవి,మిరియాలు ఏడుకల్పి సేవించిన యెడల చురుకు సెగలు మానును.

తే.గీ.ఏడుదినములు సేవింపనెల్ల గతులపొక్కులు సవాయి చచ్చును మిక్కిలిగనుగ్రచ్బు జేసెడి రోగముల్ కదలి పోవుననుచు సిద్ధుండు వచియించే నద్భుతముగ

పై పద్యములో చెప్పినమందును 7 రోజులు పుచ్చుకొనినయెడల పొక్కు సవాయి, చచ్చు మొదలగు చెడు రోగములునును.

ఆ.వె.భృంగరాజ రసము పొలుపొందగా దీసితుమ్మియాకు రసము తోడుజేసిపిప్పలందు నూరి తెప్పన బెట్టినఅక్షిమాంసదోష మణగిపోదె.

పిప్పళ్ళను తుమ్మియాకు రసముతోను గుంటగలగరాకురసముతోను చక్కగా కాటుకవలె జేసి కన్నులకు పెట్టిన దుర్మాంసదోషములడగిపోవును.

ఆ.వె.కలగరాకు రసము గారవంబునతీసిగారపండుజిగట గలయు నూరికన్నులందు బెట్ట కంపదోషమడంగునెలకు పూలుదొలగు నెమ్మి హెచ్చు.

గారపండు జిగట తెచ్చి గుంటగలగరాకురసముతో బాగుగానూరి కన్నులకు బెట్టిన యెడల కన్ను అదురుట మిటమిటలాడుటమానును. ఒక నెలరోజులు బెట్టిన పూలు కూడా మానును.

సీ. భృంగరాజరసంబు సంగతం బొనరించిమిరియపు గింజల మిళితపరచికటుకరోహిణితోడ ఖల్వంబులోనుంచియా మత్రయంబున నమరనూరి

తలమాదలకు దీని దట్టంబుగ బూయబరిశుద్ధముగ మాను వదిదినాలమరియారసంబున మంచి తెల్లనిజిల్లెడాకురసమును గల్పి యతిరయమున

తే.గీ.శ్రవణరంధ్రబులను నొక్క జాము బిడిచిచూడనెంతటి సర్పంబు గాడగరచిబాధపడుచున్న దొలగు నిర్భయతబొసగువృశ్పికవిషంబు దొలగించు వేరిపసరు

మిరియాలు కటుకరోహిణి ఖల్వములో బాగుగా గుంటగలగరాకు పసరుతోనూరి తలమాదలకు రాచినయెడల మానును, ఇదిమూడుజాములుమర్ధన పదిదినాలు రాయవలెను.

మరియు గుంటగలగరరసముతో తెల్లజిల్లేడాకు రసములోజాము పిడిచిన పాముకాటు మానును. వేరిరసము తేలుకాటునుమాన్పును.

తే.గీ.ఆరువిధముల మాదలు నణగిపోవుతేలుపడిచచ్చు పురుగులు తెరలిపోవురోమములు లేనిచోటను రోమచయముదట్టముగబట్టు కలగరాకెట్టి దొక్కొ.

అనుపాన విశేషములు బాగుగా దెలిసి పరిశుద్ధాంతస్సుకలవైద్యుడు పనిచేసేనేని అరు విధములగు మాదలును కుదురును.తేలు చచ్చును. పురుగులు నశించును. రోమములూడిపోయినస్థలములలో రోమములు మొలచును.

కం.రసవిష గంధకములతోనుసమంబులు హింగుళంబు సౌన్పి క్రమముగావెసనుగటుక రోహిణితోవిసువక భృంగరసమర్ధ విధిజ్వరహరమౌ౹౹

రసము, నాభిగంధకము ఇంగిలీకము కటుకరోహిణి సమభాగములుగా పాళ్ళువేసి గుంటగలగరాకు రసముతో మర్దించిసేవింపజేసిన సర్వజ్వరసులు మానును.

ఆ.వె.భృంగరాజ రసముపోసి యందును బ్రాతయినుప చిట్టె మొక్కయింత గూర్చికరకతాడి యుసిరికల గూర్చియు సుగంధిపాలవేళ్ళ రసము పరగబోసికల్పికాచి చక్కగలయంగబూసినవేగనెరుపుమాను వెంట్రుకలకు౹౹

గుంటగలగలర రసములో ప్రాతయినుప చిట్టెమును కరికతాడియుసిరికలును సుగంధిపాల వేళ్ళరసమును బోసి కల్పిబాగుగా కాచి తలకు బాగా మర్దన చేసి వెంట్రుకలకుయెడల అకాలపు నెరుపు తక్షణము మానును.

కం.కస్తురి గోరోజనమునుముస్తలు త్రికటుకలు త్రిఫలములు భృంగరసప్రస్తుత మర్థిత మాత్రలవిస్తరమడగున్ బ్రసూతి విషరోగములుస్ ౹౹

కస్తూరి గోరోజనము తు౦గముస్తలు శొంఠి పిప్పళ్ళు మిరియాలు కరకతాడి ఉశిరికలు, బాగుగా మర్ధించి మాత్రలు చేసిప్రసూతి, విషరోగముల కిచ్చినయెడల, నవిమానును.

ఆ.వె.భృంగరాజరసమునిడి పొన్నగంటియుపాలు నాముదంబు పరగనెయ్యినుసిరికల రసంబు నొగి కలబంచయునారికడపు పువ్వు మీరగల్పితిప్పతీగెరసము నొప్పగాచిన నూనెతలకునంట నేత్రములకు చలువ

గుంటగలగరాకు రసము, పొన్నగంటిరసము పాలు ఆముదము నెయ్యి ఉశిరికాయరసము, కలబందరసము, కొబ్బరిపూవుకషాయము, తిప్పతీగెరసము, పోసి కాచి చమురుతీసి తలకుమర్ధన చేసిన యెడల నేత్రములకు మంచిది. దీనినే భృంగామలకతైలము అందురు.

తే.గీ.ముషిణివేళ్ళ పొట్టు ముగినల్ల యుప్పియుకాన్గవేళ్ళ పొట్టు తలయనూరిభృంగనింబరస సమేతంబులం జేయనల్లకుష్ఠువేగ నాశమందు

ముషిణివేళ్ళ పొట్టును, నల్ల యుప్పి పొట్టును, గానుగవేళ్ళ పొట్టును బాగా నూరి గుంటగలగరాకు రసములోను వేపచెక్క రసముతోను కలిపి సేవించిన యెడల సల్లకుష్టు మానును.

తే.గీ. నల్ల కుష్ఠు చూర్ణమెల్లవరా యెత్తుపూట కొక్కమారు పుచ్చుకొనుచువచ్చ పెసలపప్పు నచ్చావు మజ్జిగపధ్యమని యెరింగి వాడవలయు

పైన చెప్పబడిన సల్లకుష్ఠు కేర్పడిన చూర్ణము పూటకొక్కవరహాయెత్తు చొప్పున పుచ్చుకొనవలసినది. పచ్చ పెసలపప్పునుఆపు మజ్జిగయును పధ్యములు. తక్కినవేమియు పనికిరావు.

తే.గీ.నల్ల కుష్టు మాన నరుడెంచినేనియువేపచెక్క గంధమేపు మీదభృంగరాజ రసము సంగతంబుగజేసిరాచుచుండవలయు రమ్యముగను

పైన చెప్పబడిన కష్టురోగమున కేర్పడిన చూర్ణమునుసేవించునప్పుడు వేపచెక్క గంధమును గుంటగలగర ఆకురసమునుకలిపి దేహమునకు రాయుచుండవలెను.

క.ఇలనల్ల కుష్ఠుపోవగదలచిన మూనాళ్ళకవల దలయంటుకొనన్వలయును నామిదమున నీవల నెరుగవలయు జుండువారక మనుజుల్

పైన చెప్పిన చూర్ణము సేవించునప్పుడు ఆమిదము తోమూడేసి దినముల కొకసారి తలయంటుకొనుచుండవలెను.

తే.గీ.భృంగరాజ రసము బేర్మి యంత్రంబునవారుణీరసంబు వరలకేసినిలవయుంచి రేని యిలనెల్ల రుజలకువాడవచ్చు మిగుల వైద్యనిథులు

కం.తంగేడు వేపచెట్టునుభృంగమహారాజు కాన్గవేరును త్రికటుల్శృంగారత్రిఫలములురంగగు తిప్పయును రోగరాజికి రిపువుల్

తంగేడుచెట్టు వేపచెట్టు గుంటగలగర కానుగవేరు శొంఠిపిప్పళ్ళు మిరియాలు, కరకతాడీ యుసిరికలు యివి రోగనాశకములందురు.

క. విసపుముసిణి జిల్లేడునువెసనీశ్వర దుష్ఠుపును భువింగలిజేరుంబసచెంచలి సహదేవియువిసములడచు భృంగరాజు - పృథుయుక్తి మెయిన్

విషముషిణి వేరు జిల్లేడు చిగుళ్ళు ఈశ్వరచెట్టు, దుష్టుపుయిగుళ్ళు తెల్లగలిజేరు ఆకురసము చెంచలిచెట్టు సహదేవిచెట్టు యివి గుంటగలగరాకు రసముతో కలిసిన యెడల అన్నివిషములు హరించును.

కం.కడులేత కలగరాకునువడిబచ్చడిజేసి దినమువరుసగ గొనినన్గడుబలమును కాంతియు గలిగెడునని సిద్దుండుపలికే కేవలదయతోన్

లేత గుంటగలగరాకు పచ్చడి చేయించి అనుదినముసేవించినయెడల దేహమునకు బలమిచ్పునని సిద్దుడు చెప్పెను.

క. దొడ్డిన్ గల కరమేడియుతెడ్డుపాలయును తెల్లదింటెన నాల్గున్ఒడ్డారించిన తాచులుగడ్డని నడువంగలేవు కడుభీతిమెయిన్