చతుర్థాంకురము
అశ్వలక్షణసారము
తవక్షస్థలభువనస్థితజఠర నిరుపమాన శ్రితహృదయాబ్జాసతతదయాంబుధియౌభళక్షితిపతిప్పాధినాథ చిరకీర్తినిధీ.
కృతిపతి సంబోధన
చతురత హయముల యెడలద్భుతరత నిరాప్తమహాదోషంబుల్ సన్నుత గుముతన్నామస్థితియును తత్సంబు తెలియజెప్పుదు వరుసన్.
హయములయందుగల వివిధదోషములను నిరూపించెదని గ్రంథకారుఁడు కృతిపతికి జెప్పుచున్నాడు.
అవి యెవ్వి యనిన నిశువు వివువిషమశుక్తిదంశులును కరాళరూఢకలితదంతులును విచారసారమేయసూకరబిడాలదంతులునుదంతార్గళంబులును యింద్రిమద్దీకకు జ్ఞానకారసదయావర్థులునుచిత్రరోమతుబాందులును యేకాండత్రిముష్ణులును మర్కటమార్జాల యేకపింగళియు జటామిశ్ర సీమంరస్తాలు జిహ్వాపృక్వ
ధరప్రోధమోహనంబును దీప్తపుచ్ఛంబును దీప్తపుచ్ఛంబులునుతినునీల గ్రేచవపుంసకులు ప్రేతోపనీతగంధంబులును అవఖండంబులును రసాలమార్జాలపాదులును దగ్ధచమోపనీతబంధులును కందుకనేత్రలలాటలిప్తజిహ్వవేదులును గరళంబువీకేశరులునుదోషనప్తవ్యస్ధివంశభంగులును కేశనాలంబులతోడం రాశి జనించినవియును దివాజాతంబును అమలయి పుట్టినవియును నెక్కొకగర్భంబు ననేకవారంబున జన్మించినవియును మహాదోషంబులయ్యెతల్లక్షణంబులు తత్ఫలంబులు వివరించెద. అందు దంతదోషంబులెట్టివనిన.
విషమశుక్తిదంతలును కరాళిరూఢకలితదంతులును కుక్క పందిపిల్ల మున్నగు వికారజంతువుల బోలినపండ్లు కలవియును.
సులపులై నందిజ్ఞ జొంపల నడగొరికినపసదప్పి యెడపండ్లపగిది నున్నలెక్కకు దరిగిన యెక్కువై యున్ననుచిప్పలబాగున వొప్పకున్నమొదళ్ళ వేరొండు మొలచిన విలిగినపదివచ్చిపంతనే నమువబడినపారమేయబిడాలచజలదంతంబులుకెనయైనబాగున మొనసియున్నయట్టిపండ్లున్న వాజుల కట్టరాదుభవ్యచారిత్ర సలలితపద్మనేత్రశత్రునిర్భరరాయ వేశ్యాభుజంగరాజకులదీపయోభవ రాజకంప.
లెక్కింపగా తక్కువయైయున్నను ఎక్కువయైయున్నను చిప్పలవలె నుండకున్నను దంతముల మొదళ్ళను యింకొకదంతము మొల
చినను దిరిగినను కుక్క పిల్లి మున్నగు వానిదంతములవలె నున్నను యాగుర్రములను శాలయందు గట్టరాదు.
పరికింప నల్లపండ్లకుహరినామం బసితదంతినరుదగ గేవాస్పురదురునానానంపధ్వరవిఘటనకారి గాన వల దది నిలుపన్.
పంక్తి చక్కగాక పండ్లు లోన్కి వెలికిపెరిగియున్న యదియు విషమదంతినిలువజనదు దాని నిలిపిన యౌగదాపుత్రశోకవహ్ని పొగలజేయు.
పండ్లవరుస చక్కగా నుండక పండ్లు లోనికి పోయినట్లుగాని వెలికి వచ్చినట్లుగాని ముందునకు వెనుకకు బోయినదానిని విషమదంతి యందురు విసరదంతి విసమదంతి సమమగు దంతములు లేనిది. అట్టిగుర్రము నిలిపినవానికి పుత్రశోకము కలుగును.
శునకదంతి యనగ సొరిదిగా జిప్పలుపెట్టినట్టిపండ్లు పెరిగియున్నహరుమునామధేయ మధిపతినాకవినీరువట్టుచేత వెరుగుపరచు.
మిత్రభయము సకలశత్రువృద్ధియు జేయుహీనదంతము కుదమైనవాజినీయధికదంతియైన యావాజి ప్రజలతోవిభుని ననుపు జమునివీడు చూడ.
తక్కుపండ్లు కలిగినహయము మిత్రులవలన భయమును శత్రువులవలన పీడయు నెక్కువ జేయును ఎక్కువపండ్లు కలిగినతురంగము ప్రభువును యాతనిప్రజలను యముని చూచుటకై పంపును.
సరిచూడ మత్తవాధరములలో నొక్కయెడనాడి పొడవైన యదికరాళిసమనుష్యద్వినాంకుశపంక్తిరీతిదంతాలు చెప్పడిన కరాళిదంతిబరిపాటి నెడవెట్ట పండ్లది వచ్చినహయమునామంబు దంతార్గళంబుపండ్లన్నియును వచ్చి బలువైన యున్నచోమొసలిపం డ్లున్నది మూఢదంతిఅన్నిహయములు తమకులమెల్ల నణచిపతుల గదలని పగరతో బరచియలచుపుచ్చిపండ్లును నల్లనిపుప్పిపండ్లుపరగు వాజులు తగవెందు కంపభూప.
అరయంగా హరియండయుగ్మము దానై దేండ్లునుందోవ పెందొరగింగాంచి రతిక్రియాకలన కుద్యోగింపకున్నేని నత్తురగం బెన్నగ నింద్రియవృద్ధి యది దా దుష్టాత్మయై కర్త నిర్జరలోకంబువ కన్పిపుచ్చు తనవంశంబు సహాయంబుగన్.
ఏకముష్కంబుల ధీశుని తత్తూనికాలునిపురికి వేగంబ యనుచువివిధవర్జాదులు వివిధాంధులును పతిపుత్రులనెల్ల దా సొలియజేయులలితోను లక్షితాండులు నిజనాథునికౌతుకశ్రీనేల గలియజేయుమార్జాలముష్కులు మర్కటాండులు తనజనపాలునకు పలాయనము దెచ్చుజాతముష్కతురంగంబు జాతవేదుకాహుతిగ జేయు తనునేలు నతనియిల్లు
కూర్మితో నండయుగ్మంబు గలుగకున్నహరుల గట్టంగజనదు మోహనమురారి.
అరయగ నేకపింగళి హయంబు నిజాధిపు ప్రాణవహ్ని నుద్దురగతి యుద్ధభూమి నతిదుర్దమసత్రునృపాల సాయకోలోత్కరవరషంబుచే దనుపు గావున నత్తురగంబు నెందునుంబురమున నుండనీజనదు పోడిమతోనున గోరువారికిన్.
పరగగ కేశవాలమున బాసి జనించిన దుష్టవాజినిన్పరముగ నేలువాని ననపత్యుని జేయు కణంగి చూడగాశిరమున ప్రోద్దకోశమున చెన్నగు శాశ్విత రోమజాతురుల్కరము శితంబులైన తురగంబులు రాజుల గూల్చు నాజులన్.
కృష్ణవాలహయము చాలకీడు యుద్ధభూమిలోద్రిష్ణిదీర నరుల ద్రుంచి తెగు నధీశుతోడ దాకృష్ణవర్త్మ యదరి యుగ్రకీల లెసగ నేర్చి యాముష్కతానిరూఢి దక్కి యుక్కడంబు చాడ్చునన్.
హయము కృష్ణజిహ్వ యాజిరంగంబునకరుగజేయు విభుని యధికయశముననుచు దెలిపి తజ్ఞులగువారు నిల్ప రవ్వాజి నెందు కంప వసుమతీశ.
నల్లనగు నాలుకగల తురంగము సమరమందు యజమానునియొక్క పూర్వయశము నశింపజేయునని హయలక్షణ త్తలు దానిని గొన నొల్లరు.
అరయ యేకవర్ణమై మేను మెరయంగవాలశిరము వొండువన్నెలైనఘోటకంబు కడగి ఘోరాజిలోపలకర్త ప్రేతపురికి కానుకిచ్చు.
ప్రాప్తనిర్మలైకవర్ణమై వెలుగుచున్నయానెత్తి యుగ్రనాల యొక్కచాయయై తనర్చినదిప్తపుచ్చమది యధీశుని కౌతుకాదినిన్సప్తజిహ్వగాన నిలుపజనదు కంపభూవరా.
మసక యొకింత లేక శశిమండలిమీద వినీలరోచులంవిసపుదై వినీలమణి నిచ్చినచాడ్పున వెల్లజాయతోమసలిన మేనునం వెసను మస్తకముందన రారుచుండగాత్రిసరియనంగదా బరగ ధీశ్వర సర్వధనాపహారియై.
వుగ్రాక్షు డనగ దగు నిలసుగ్రీపుని గళముబోలు గళము గలదది యలనీలగ్రీవనుహయ మత్యుగ్రంబై పతి ధణంబు యశమున రాచున్.
మూడు కాళ్లును కడగిన ముసలి యగునువెలయ నొకకాలు కడగిన విషమపాదిఅదియు నదియును చాలదోషావహములుఅవిళతలమున తిలకంబు కలుగకున్న.
ముసలినిగూర్చి వెనుకటి యాశ్వాసములలో జెప్పినది చాలక మరల చెప్పుచున్నాడు. అవిళభాగమున తిలకమున్న దానిని మద్యమపక్షపువాజిగా నెన్నవచ్చును.
పెక్కువన్నెల పులిభంగి బేర్చియున్నఅశ్వనామంబు పరికింప సవఘటంబుకణగి యావాజి నేలక పుడమియెల్లవెడల నడపింపవలయు భూవిభుని కధిప.
పెద్దపులివలె మూడు నాలుగు వర్ణములు గలిగిన తురంగమును నవఘంబు అందురు. అట్టితురగంబును నిముషమైనను నిలువక వెడలగొట్టవలయును.
కరరూపశ్వరవర్ణోత్కరములలో నొకటి యయిన గగఖర సారమస్తురంగముఅరయంగా పుత్రమిత్రహానిం జేయున్.
గార్ధబంబు రీతి ఘనవర్ణగౌరాళియేహయంబు పెట్ట నెసగునట్టిహయము గౌరవవృష్టి యదియుచిత్రపదులు పతుల శిరుల నణచు.
శిరము పుచ్ఛమూలంబు వరుసజదగ్ధచర్మోపమానగంధంబులైనవాజి తలపోయ కెక్కెడువానియిల్లుయనలశిఖలకు నాహార మగుచునుండు.
శిరము తోకయును కాలినచర్మముల వాసన గలిగిన నా గుర్రమును నిలుపజనదు. ఎవనియింట నాగుర్ర ముండునో వాని యిల్లు యగ్నిహోత్రున కాహుతి యగును.
కవలనుచుం హయంబులు తగం జనియించిన వాని యిల్లు దాన.............................................................................నాచవిగొన గాన తక్కిన విచారము సేయక దేవతాదినిజుల కిచ్చు టొప్పునని ధీరులు చెప్పిరి శాస్త్రసమ్మతిన్.
గుర్రమున కొకసారి రెండుపిల్లలు పుట్టిన తక్షణమ యాగుర్రమును పిల్లలతోగూడ దేవతలకుగాని బ్రాహ్మణులకుగాని యివ్వదగును. కాని నిలుపరాదు.