ఏకాశ్వాసము
ఆంధ్రభాషాభూషణము
శ్రీవాణీగిరిజేశ దంతిముఖ రాజీవాప్తులం గొల్చి వాగ్దేవిం జిత్తములోన నిల్పుకొని శక్తిం భక్తిఁ గీర్తించి నానావిద్వత్సభలన్ వలం గొనువినూత్నప్రౌఢకావ్యక్రియాప్రావీణ్యంబున నుల్లసిల్లుకవులన్ బ్రార్థించి ధన్యుండ నై.
వివిధకళానిపుణుఁడ నభినవదండి యనంగ బుధజనంబులచేతన్భువిఁ బేరుఁ గొనినవాఁడనుగవిజనమిత్రుండ మూలఘటికాన్వయుఁడన్.
ఖ్యాతశుభచరిత్రుఁడ వృషకేతనపాదద్వయీనికేతనుఁ డనఁగాఁగేతన సత్కవి యనఁగాభూతలమున నుతిశతంబుఁ బొందిన వాఁడన్.
మ్రానయకును నంకమకునుసూనుఁడ మిత సత్యనయవచో విభవుఁడవిజ్ఞానానూనమనస్కుఁడనానాశాస్త్రజ్ఞుఁడను గుణాభిజ్ఞుండన్.
కవితఁ జెప్పి యుభయకవిమిత్రు మెప్పింపనరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁబరఁగ దశకుమారచరితంబుఁ జెప్పినప్రోడ నన్ను వేఱె పొగడ నేల.
మున్ను తెనుఁగునకు లక్షణమెన్నడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెద విద్వన్నికరము మది మెచ్చఁగనన్నయభట్టాదికవిజనంబులకరుణన్.
సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పితెనుఁగునకు లక్షణముఁ జెప్పు కునికి యెల్లఁగవిజనంబుల నేరమి గాదు నన్నుధన్యుఁ గావింపఁదలఁచినతలఁపుగాని.
భాషావేదులు నను వినియాషణ్ముఖపాణినులకు నగు నెన యని సంతోషింప నాంధ్రభాషాభూషణ మనుశబ్దశాస్త్రమున్ రచియింతున్.
ఒప్పులు గల్గిన మెచ్చుఁడుతప్పులు గల్గిన నెఱింగి తగ దిద్దుఁడు త
ప్పొ ప్పనకుఁ డొప్పు త ప్పనిచెప్పకుఁ డీ కవు లుపాస్తి చేసెద మిమ్మున్.
గుణదోషంబు లెఱిఁగి యిదిగుణమిది దోష మనిపూజఁ గొందురు సుకవుల్గుణదోషము లెఱుఁగక దుర్గుణములె గుణములనిపూజఁ గొందురుకుకవుల్.
క్రొత్తగ నాంధ్రభాషకును గొండొకలక్షణ మిట్లు చెప్పెనేయుత్తమబుద్ధి వీఁడ యని యోరలు వోవక విన్న మేలు మీరొత్తిన మీకు మాఱుకొని యుత్తర మిచ్చుట చాలవ్రేఁగు మీచిత్తమునందు న న్నెరవు సేయకుఁడీ కవులార మ్రొక్కెదన్.
నేరములు కాళిదాసమయూరాదుల కైనఁ గలుగ నొరులకు లేవేసారమతు లైన సుకవులకారుణ్యము కలిమి నేర్పు కవిజనములకున్.
కంచి నెల్లూరు మఱి యోరుఁగ ల్లయోధ్యయనుపురంబులపై గంగ కరుగు మనిన
పగిది నొకత్రోవఁ జూపెద బహుపథంబులాంధ్రభాషకుఁ గల వని యరసికొనుఁడు. 13
ఆ. తల్లి సంస్కృతంబె యెల్లభాషలకునుదానివలనఁ గొంత గానఁబడియెఁగొంత తాన కలిగె నంతయు నేకమైతెనుఁగుబాస నాఁగ వినుతి కెక్కె. 14
క. తెలుఁగునఁ గల భేదంబులుఁదెలుఁగై సంస్కృతము చెల్లు తెఱఁగులుఁ దత్సంధులును విభక్తులు నయ్యైయలఘుసమాసములుఁ గ్రియలు నవి యెఱిఁగింతున్. 15
క. ఆదులు స్వరములు నచ్చులుకాదు లొగి న్వ్యంజనములు హల్లులు ననఁగామేదిని నెల్లెడఁ జెల్లునుకాదుల నైదైదు కూర్ప నగువర్గంబుల్. 16
క. యరలవలును శషసహలునునరయఁగ నంతస్థ లూష్మ లనఁగాఁ జెల్లున్సరవి నివె పేళ్లు పెట్టుదుఁదిరముగఁ దల్లక్షణములు దెలిపెడిచోటన్. 17
క. ఆఱు సమాసము లిరువదియాఱంతము లాఱుసంధు లవ్యయములు పెక్కాఱింటిసగము రీతులునాఱింటికి నొక్కఁ డెక్కు డౌను విభక్తుల్. 18
ఆ. తత్సమంబు నాఁగఁ దద్భవం బన నచ్చతెనుఁగు నాఁగ మఱియు దేశ్య మనఁగగ్రామ్యభాష నాఁగఁ గల వైదుతెఱఁగులువేఱె వేఱె వాని విస్తరింతు. 19
క. మును సంస్కృతపదములపైఁదెనుఁగువిభక్తులు ఘటించి తేటపడఁగఁ జెప్పిన నది తత్సమ మనఁ జనువనము ధనము పురుషుఁ డబల వసుమతి యనఁగన్.
క. లచ్చి యన లక్ష్మిపే రగునచ్చం బన నచ్ఛమునకు నభిధానము వివ్వచ్చుఁడు బీభత్సుఁడు విద్వచ్చయ మనునిట్టితెనుఁగు తద్భవ మయ్యెన్.
సీ. అర్ఘంబె యగ్గువ దీర్ఘక డిగ్గియగుణములు గొనములు కులము కొలము
స్నిగ్ధంబు నిద్దంబు శ్రీ సిరి భంగంబుబన్నంబు దిశ దెస భాష బాసయక్షులు జక్కులు యముఁడు జముం డగునాజ్ఞప్తి యానతి యాజ్ఞ యానద్యూతంబు జూదంబు దోషంబు దోసంబుముగ్థుండు ముగుదుండు ముఖము మొగము
తే. పసదనంబు ప్రసాదనం బసము యశముసమ్మెటయ చర్మయష్టి కర్జంబు కార్యమీరసం బీర్ష్య వేరంబు వైర మిట్టిపగిది పల్కులు తద్భవపదము లయ్యె. 22
క. తల నెల వేసవి గుడి మడిపులి చలి మడుఁ గూరు పేరు బూరుగుమగవాఁడలుక యని యెల్లవారికిఁదెలిసెడియాపలుకు లచ్చతెనుఁగనఁబరఁగున్.
సీ. ఎఱుకువ నెత్తమ్మి యెరగలి యెసకంబునొస లింతి తేఁటి వెక్కసము నెమ్మిమక్కువ చెచ్చెర మచ్చిక పొచ్చెముకదిమి యేడ్తెఱ లగ్గు కలవలంబు
వెన్ను విన్నదంబు వీనులు వెన్నడియెక్కలి తివురుట యుక్కు మేటిబాగు తొయ్యలి బోఁటి ప్రన్నన సరి జోటివేనలి పొలపంబు విన్ను మన్ను
తే. నెల్లి కొఱలుట వీచోపు లుల్ల మువిదవీఁక కాఱియ గ్రద్దలు వేఁట గ్రేణికౌను పాలిండు లొగి మొగి గనయ మిట్టితెఱఁగుపలుకులు ధర దేశితెనుఁగు లయ్యె.
సీ. తెమ్మెర లెలమావి తెలిగన్ను క్రొన్నననలరాజు రేఱేఁడు వాలుఁగంటియలరులపిండు తెక్కలికాఁడు క్రొమ్మించుకెమ్మోవి కెంజాయ కమ్మతావికడలి తామరకంటి వెడవిల్తుఁ డెడకాఁడునలువ కలువకంటి నాన సెగ్గమెలనాఁగ ముద్దియ చెలువ చిగురుబోఁడితెఱవ తలిరుబోఁడి మెఱుఁగుబోఁడి
తే. పదరు విసువుట పరి గమి పసలు నసదుపొద్దు రేయెండ తబ్బిబ్బు పోటు ముట్టు
తనివి వలవంత చెంత మంతన మనంగఁదేరనాడిన దేశ్యంపుఁదెనుఁగు లయ్యె. 25
సీ. పంచాకుమయ్య తోపించాకుమయ్య వాటీదెచ్చుతారు మమ్మూదలంచియేగ గొంటూరమ్ము యేదాలు వోదాలుమోనేటివా రానసేసువారువాడి విరాళితో బాడిగ వోకుమీయీడేకదా మమ్ము యినుతిసేసెపంపేరు తెంపేరు పాడేరు సూసేరుయిందాము కందాము పొందు మిస్తి
ఆ. అటుకు దవ్వు వెగడు నషువలె నిషువలెనాడ నీడ నేడ నచ్చ నిచ్చనోయ గాయ వేయ కుండాడు బామ్మఁడుగద్ద గుద్ద నాఁగ గ్రామ్య మయ్యె. 26
ఆ. తత్సమంబు దక్క తక్కిన నాలుగునచ్చ తెనుఁగు లందు రఖిలజనులునందులోన గ్రామ్య మనఁగ నెవ్వరు నొప్పరొరులఁ దెగడుచోట నొప్పు నదియు. 27
వ. అనంతరంబ సంస్కృతపదంబులు తెనుంగు గావించుతెఱం గెఱింగించెద. 28
సీ. వృక్షేణ దక్షాయ పక్షిభిః పుత్త్రస్యయనువిభక్తులు దెనుంగునకుఁ జొరవుఅస్తి ప్రయాతి గాయంతి భుంక్తే సంతినయతి స్మరతి యనుక్రియలు సొరవుగత్వా హసిత్వా ప్రకాశ్య సంత్యజ్య నాఁదనరు త్వాంతల్యబంతములు సొరవుగంతుంపురీం రిపుంహంతుం సుతంపాతుమనుతుమున్నంతంబు లరయఁ జొరవు
తే. అపి చ తు హి వై న వా నను లనఁగఁ బెక్కులవ్యయంబులు చొర వెందు నాంధ్రకవితఁబెఱపదంబులతోడను దొరలినిల్చునవి తెనుంగులు గావింతు నభిమతముగ. 29
క. ఇల సంస్కృతపదములపైనెలకొని నిల్చినవిసర్జనీయంబులు సున్నలు నిలువవు తెనుఁగులలోనలవడఁగాఁ బల్కుచోట నభినవదండీ. 30
క. లలి నేకాక్షరపదములువెలిగాఁ దక్కినపదముల వెలసినతుదయచ్చులనిడుపు లుడుపఁ దెనుఁ గగునిల నెప్పటియట్ల యుండు నీయంతంబుల్. 31
క. స్త్రీ యన ధీ యన శ్రీ యననీయేకాక్షరపదంబు లీక్రియఁ జను గౌరీ యన గౌరి యగున్ వాణీ యన వాణియగు మణి మణీ యనుచోటన్. 34
క. లక్షణములు దెలిపెడిచోనక్షరములు దెలియుకొఱకు ననువైనక్రియన్శిక్షార్థముగాఁ బల్కెదలాక్షణికులు తప్పుగాఁ దలంపకుఁడు మదిన్. 33
క. వుఱ్ఱగు నుఱ్ఱంతముపైముఱ్ఱగు నఱ్ఱంతశబ్దములపై రెంటన్డుఱ్ఱగుఁ బురుషాఖ్యలపైన ఱ్ఱు ఱ్ఱగు నట్టియెడల నభినవదండీ. 35
క. వానునకున్ వంతుండునుమానునకును మంతుఁడును గ్రమంబున నగు శబ్దానీకాంతనకారముమానించి విభక్తు లెక్కుమఱియొక్కొకచోన్. 36
క. తరువు తనువు ధన మర్థముగురుఁడు పురుషుఁ డుత్తముండు గుణవంతుఁడు సుస్థిరమతిమంతుఁడు యశముననరుడుగ హనుమంతుఁ డన నుదాహరణంబుల్. 37
బూరితాత్ముఁ డనఁగఁ బుణ్యకర్ముఁ డనంగఁబుష్పధన్వుఁ డనఁగఁ బొలుచు జగతి. 39
ఆ. గురువు ప్రభువు నాఁగ గురుఁడు ప్రభుం డనశర్మ వర్మ నాఁగ శర్ముఁ డనఁగవర్ముఁ డనఁగఁ జెల్లు వటువును మనువునుజటువు డులకుఁ బాసి పరఁగుచుండు. 40
తే. ద్విట్పదమునకు ద్విషుఁ డగు విద్విషుండువిత్పదమునకు విదుఁ డగు వేదవిదుఁడుభుక్పదమునకు భుజుఁ డగు భూభుజుండుదిక్పదమునకుఁ గుఱ్ఱగుఁ దెలియు దిక్కు. 41
క. తెలుఁగున సంస్కృతపదములుపలికెడి తెఱఁ గెఱిఁగినంత ప్రవ్యక్తముగాఁదెలిపితిఁ దెలుపనిపదములుగల నవి సంస్కృతముతోడఁ గలయుఁ దెనుఁగునన్.
ప. అనంతరంబ సంధు లెఱింగించెద. 43
క. వెందలిపదము తుదివర్ణమువదలక పైపదము మొదలివర్ణముతోడంగదియఁగ సంధులు నాఁ దగువిదితపుఁదత్సంధు లెల్ల వివరింతుఁ దగన్. 44
క. ఉత్వము క్రియల కినులపైనిత్వము పెఱరూపు దాల్చు నీవే ననఁగాసత్త్వముఁ గలిగెడి నూరి కతిత్వరితము పొండు నాఁగఁ దెల్లం బగుచున్.
క. అచ్చుగ నఱ్ఱి ఱ్ఱు ఱ్ఱలునచ్చులె యంతమునఁ దెనుఁగుటభిధానములన్విచ్చలవిడిఁ బలుకులఁ బెఱయచ్చులు చనుదెంచుమానవాఖ్యలయందున్.
వ. తత్సంధిక్రమం బెట్టిదనిన.
తే. అవనినాథుఁడు దయఁ జూడ కనిపినాఁడురాజు దయలేక యున్నాఁడు రమణియెడనుఅలరుబం తిది మేల్బంతి యది యనంగనెల్లకృతులను మిక్కిలి చెల్లుఁ గాన. 48
క. అచ్చుగఁ బెఱయచ్చుల పైనచ్చు యకారంబుఁ దాల్చు నబలా యేలేయిచ్చ యపూర్వమొకో యిదియచ్చెరువై యునికి నా నుదాహరణంబుల్. 49
తే. ఒనర నుఱ్ఱంతషష్ఠిపై నున్నయచ్చుమొదలఁ బొల్లునకారంబు గదిసి నిల్చు
కొడుకునా ల్గూఁతునొడమి నాఁ గూడుఁ గానికూఁతొడమి కొడుకా లనఁ గూడ దెందు. 50
క. అది యిఱ్ఱంతముమీఁదన్గదిసిన నాద్యచ్చుడుగు వికల్పముతోఁ గాలిది కాలియది యనఁగఁ జేతిది చేతియది యని పలుకఁ దెల్లం బగుచున్. 51
క. అచ్చుగఁ బై హ ల్లుండకయచ్చుండినఁ దద్ద్వితీయ కంత్యనకారంబచ్చోఁ బాయక నిల్చునువిచ్చలవిడిఁ బోవు నచ్చు వేఱొక టైనన్. 52
క. సుతు నడిగె సుతుని నడిగెనుసుతు ననిచె న్సుతుని ననిచె సుతునిం గెలిచెన్సుతు గెలిచెఁ బోరిలో నుద్ధతుఁ డొకఁ డనవరుసతో నుదాహరణంబుల్. 53
క. నాంతం బైనపదంబులపొంతం బై నున్నశబ్దముల కచటతపల్దొంతి గజడదబ లగు నయ్యంతనకార మగు సున్న యభినవదండీ. 54
ఆ. వానిఁ గనియెఁ జేరె వానిఁ డక్కరిఁ జేసెవానిదానిఁ దెగడె వానిఁ బొదివె
ననఁగ వరుస నివి యుదాహరణంబులునుతగుణాభిరామ నూత్నదండి. 55
క. కుఱుచలతుది హల్లులకున్బిఱుఁద న్నెలకొన్నయట్టిబిందువు లెల్లన్నెఱయఁగ నూఁదుచుఁ దేలుచునొఱపై యిరుదెఱఁగుఁ జెల్లుచుండున్ గృతులన్. 56
క. ననుఁ గను నన్నుం గను దాఘనుఁడు ఘనుం డనఁగఁ జెల్లుఁ గవ్యనుమతిచేఁదను బోఁటి లోభివాఁ డితఁడన నిడుపులమీఁదిబిందు లరబిందు లగున్. 57
క. కుఱుచలపై యరబిందులునెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్నెఱయవు గద్యంబులలోనెఱబిందువు లూఁదుబద్యనికరములోనన్. 58
క. నన్నును నిన్నునుఁ దన్నునున న్నందుల కునుల కినులయందును మును పైనున్న నకారపుఁ బొల్లులుపన్నుగఁ బోఁ జూపు నచ్చుపై నున్నయెడన్. 59
క. న న్నెఱుఁగు నన్ను నెఱుఁగున్దన్నెఱుఁగుచుఁదన్ను నెఱుంగుఁదత్త్వజ్ఞుఁడిలన్ని న్నెఱుఁగు నిను నెఱుంగునునన్నం బరువడిగ నివి యుదాహరణంబుల్. 60
క. తన కెనయె తనకు నెనయేముని కెనయే మునికి నెనయె మూర్ఖుం డనఁగాఁగునులకుఁ గినులకు జగతిన్దనరంగా వరుసతో నుదాహరణంబుల్. 61
క. పొసఁగం బల్కెడునెడ బొల్పెసగినప్రథమాంతములపయిం గదిసి కడున్బస నారుకచటతపల నుగసడదవల్ ద్రోచి వచ్చుఁ గవిజనమిత్రా! 62
తే. సుతుఁడు గడువేగమున వచ్చె సుతుఁడు సనియెసుతుఁడు డక్కరితోఁడఁ దాఁ జుట్ట మయ్యెసుతుఁడు దండ్రికిఁ బ్రణమిల్లె సుతుఁడు వుట్టెననఁగ నివి యుదాహరణంబు లయ్యెఁగృతుల. 63
క. లెలుఁగులలో నచ్చంబులుడులు రులు సులు పదముతుది నడమఁ గలిగిన ని
మ్ముల దానిమీఁది యుత్వముపొలుపుగ హ ల్లుండెనేనిఁ బోపు న్నిలుచున్. 64
ఆ. మారుమండఁ జొచ్చె మార్మండె వ్రే ల్మట్టెవ్రేలు మట్టె వేడ్క వేడు కయ్యెకాఱుకాల మనఁగఁ గార్కాల మనఁ గాన్పుకాను పనఁగ నెల్లకడలఁ జెల్లు. 65
ఆ. ఏకపదము నడిమియిత్వ మొక్కొకతఱినచ్చతెనుఁగులోన నడఁగుఁ బొడముఁగూర్మి తాల్మి యనఁగఁ గూరిమి తాలిమియనఁగ గృతులఁ జెల్లు చునికిఁ జేసి. 66
క. అ ఱ్ఱి ఱ్ఱంతంబులపైయుఱ్ఱగు నన్నయును దల్లియును ననుక్రియ నాయుఱ్ఱంత మొందుచోటులనుఱ్ఱగు మనుమఁడును నందనుండును ననఁగన్. 67
క. పలు కనుట యేకవచనముపలుకుపయి న్లులను నిలుప బహువచనంబుల్నెల నెల లనఁ దల తల లనఁజిలుక చిలుక లనఁగ జగతిఁ జెల్లుటవలనన్. 69
క. డుల నెల్లయెడల ద్రోచునుదెలుఁగువిభక్తులక్రమంబుఁ దెలిపెద ననఘుల్బలవంతులు ధనవంతులుకులజులు నయవిదులు భావుకులు ననఁ జనుటన్. 70
క. లులమీఁద లులకు రుఱ్ఱగునిలఁ బెక్కిట బాలు రన మహీపాలు రనన్లలితదయాళు రనంగానలవడ వర్తిల్లుఁ గాన నభినవదండీ. 71
క. సోఁడిగ బహువచనంబులువీఁ డనుచో వీండ్రు వీరు వీరలు నయ్యెన్కాఁ డనఁ గాం డ్రనఁ గా ఱనవాఁడునకున్ వాండ్రు వారు వారలు నయ్యెన్. 72
ఆ. కొఱను నెఱను నాఁగఁ గొలను నా మ్రా ననఁగలను గనను కెలను వలను నాఁగఁబరఁగుశబ్దములకు బహువచనంబులనులకుఁ గులు విధించె నూత్నదండి. 73
క. కొఱఁకులు నెఱఁకు లనంగామఱియుం గొలఁకులును రేఁగుమ్రాఁకులనంగామెఱయున్ గలఁకులు గవఁకులునెఱకెలఁకులు వలఁకు లనఁగ నెగడెడికతనన్. 74
ఆ. ఇల్లు కల్లు ముల్లు పల్లు వి ల్లన నివిబహువచనము లగుచుఁ బరఁగు నెడలనిండ్లు కండ్లు ముండ్లు పండ్లు విం డ్లనఁ జనునుతగుణాభిరామ నూత్నదండి. 75
తే. పేను చేను మీ ననునివి పెక్కులైనఁబేలు చేలు మీలు ననఁగఁ బోలు జగతియిలకుఁ దులువొందు నొకకొన్ని యిలనడంచిలులబహుత్వమునం దుది మెలఁగుచుండు. 76
తే. చేయి వాయి నేయి యనుచుఁ జెప్పుచోటఁబ్రీతిఁ జేతులు వాతులు నేతు లయ్యెరాయి రేయి వేయి యనుచో రాలు రేలువేలు నా నొప్పు బహువచోవేళయందు. 77
క. రులుడుదు లంత్యము లైనన్లుల నడఁచి తదంత్యములకు ళుఱ్ఱగు బహుతంబలుగొళ్లని కొనవేళ్లనికలగూళ్లున్ లేళ్లు నాఁగఁ గ్రమమై యునికిన్. 78
క. పదము తుది యిత్వ ముత్వముపదిలంబుగ బహువచనముపై నొందినచోనది దెలియుఁడు మణులు ఘృణులుసుదతులు సన్మతులు సఖులు సుకవు లనంగన్. 79
తే. పరఁగుఁ చెక్కిట నొకటె తెమ్మెరలు నీళ్లుపఱలు కొలుచులపేళ్లెల్ల బహువచనముగోదుమలు వడ్లు జొన్నలు కొఱ్ఱ లాళ్లుచోళ్లు ననుములు పెస లనఁ జెల్లుఁ గాన. 80
క. చెలియ లన నా లన మఱందలు కోడలు నాఁగ జనుపదంబులతుదలన్లులకుం డ్రలగుం బెక్కిటఁజెలియం డ్రన నాం డ్రనంగఁ జెల్లుటవలనన్. 81
క. జంగమపదములుఁ దక్క ధరం గలపదములద్వితీయ ప్రథమయు నగు రాజంగదము లూడ్చెఁ బతినూత్నాంగదములఁదాల్చెననఁగ ననువై యునికిన్. 82
తే. వలసినప్పుడు చేత కై వలన యొక్కయందు ననునివి యగుఁ దృతీయాదులందుస్త్రీపురుషశబ్దములయందు జేత వలననందు ననునివి యగుఁ దృతీయాదులందు. 83
తే. దులకు నిను నేకవచనము తెలుఁగులందునిలుచుఁ దత్సమపదముల నిలుచుఁ బోవులలు ద్వితీయాదు లగువిభక్తులకు నెల్లబహువచనములై చను నెల్లపదములందు. 84
క. కమియంగ నికి నకులు తత్సమములఁ బోఁద్రోచి నిలుచు షష్ఠి చతుర్థిన్గ్రమమునఁ గుఱ్ఱగు నఱ్ఱంతమునకు నుఱ్ఱంతమునకుఁ దగు నఱ్ఱు లలిన్. 85
క. గురునికి గురునకు ననఁగాఁబరఁగఁగ బాలునికి ననఁగ బాలున కనఁగాగరగకు గొరవకు ననఁగాఁదరమున కురమునకు నా నుదాహరణంబుల్. 86
క. ఇ ను డు రు లు ఱ్ఱంతములకుకినులగు వారిథికి చేనికిని నాడికి నోలిని యూరికి వ్రేలికి ననకును లగు బహువచనములకుఁ గొడుకులకు ననన్. 87
వ. తత్సమపదాంతంబు లగుసప్తవిభక్తులందు నేకవచన బహువచనము లెట్టివనిన. 88
క. సుతుఁడు సుతు సుతుని గనియెన్సుతుచేతన్ సుతునిచేత సుతునకు నిచ్చెన్సుతునికిని సుతునివలనన్సుతువలనన్ సుతునిధనము సుతుధన మెలమిన్. 89
క. సుతునందు సుతునియందున్సుతులు సుతుల సుతులచేత సుతులకు నిచ్చెన్సుతులవలన సుతులధనముసుతులం దన నేక బహువచోనియతి యగున్. 90
వ. ముఱ్ఱంతములకు. 91
క. వృక్షము మొలచెను నఱికెనువృక్షము వృక్షమున బ్రతికె వృక్షమునకు నీవృక్షమునఁ బండు వడియెనువృక్షముతుది వృక్షమున దవిలెనాచూడ్కుల్. 92
క. వృక్షంబులు వృక్షంబులవృక్షంబులచేత బ్రతికె వృక్షంబులకున్వృక్షములవలనఁ బండునువృక్షంబులతుదలఁ గలవు వృక్షములందున్. 93
వ. లాంతములకు. 94
క. తలయొప్పెన్ దల దిగిచెన్దల దాల్చెన్ దలకుఁ జీడ తలవిరి దొలఁగెన్తలవెండ్రుక తలసొమ్ములుతలలం దన నిట్లు బహువిధంబులఁ జెల్లున్. 95
క. తల లొప్పెఁ దలలు దునిమెనుతలలన్ ధరియించెఁ జీరతలలకునాడెన్దలఁ జుట్టె పెడతలవడెన్దలలకు మణిభూషణములు తలలం దనఁగన్. 96
వ. ర్యంతములకు. 97
క. కరివచ్చెన్ గరినెక్కెనుగరిచేతం జచ్చెఁ గరికిఁ గవణమువెట్టెన్గరివలననుఁ గరికుంభముకరియందు మదాంబుధార కడుబెడఁ గయ్యెన్. 98
తే. టడల రేఫకారముల్ దొడరెనేనియొక్కెడన రెండుమాత్రల లెక్క కెక్కు
బంట్లు బంటులు నా బండ్లు బండు లనఁగగుంట్ర గుంటర నా గుండ్ర గుండ రనఁగ. 99
క. కూఁతురుపదము రుకారముబ్రాఁతిగఁ దాఁ జెడు విభక్తి పైఁ బెట్టినచోఁగూఁతురు కూఁతుం గనియెనుగూఁతులచేఁ గూఁతువలనఁ గూఁతులధనముల్. 100
వ. అనంతరంబ సంబోధనంబు లెఱింగించెద. 101
తే. ఏకవచనపుఁదుదలందు నెలసి నిలుచునుత్వ మత్వ మౌ నిత్వంబు నీత్వ మొందునార బహువచనంబు పైఁ జేరి నిలుచుహ్రస్వములు నిడుపు లగుఁ గవ్యనుమతమున. 102
క. సుతుఁడ సుతుండా యనఁగ సుదతి సుదతీ యనఁగ విమలతరమతులారాహితకారులార యనఁగానతిశయముగ వరుసతో నుదాహరణంబుల్. 103
క. అమర డు సంబోధనతత్సమములఁ బొడచూపు నొక్కతఱి నోపురుషోత్తమ యోపురుషోత్తముఁడా!విమలయశా విమలయశుఁడ వినుమని చనుటన్. 104
వ. యుష్మదస్మత్పదంబు లెఱింగించెద. 105
ఆ. ఎలమి నీవు మీరు నే నేము ప్రథమలునిన్ను మి మ్మనంగ నన్ను మమ్మునన ద్వితీయ లయ్యె నని యుష్మదస్మత్పదములు దెలియ నూత్నదండి సెప్పె. 106
క. నీమీలకు నామాలకుధీమహితా వరుసతోఁ దృతీయాదులయందేమఱక చేతనాదిస్తోమం బిడ నేకబహువచోనియతి యగున్. 107
క. దేవా నీచే నీకున్నీవలనన్ నీధనంబు నీయం దనఁగాదేవా మీచే మీకున్మీవలనన్ మీధనంబు మీయం దనఁగన్. 108
క. దేవా నాచే నాకున్నావలనన్ నాధనంబు నాయం దనఁగాదేవా మాచే మాకున్మావలనన్ మాధనంబు మాయం దనఁగన్. 109
క. పెడతలయును క్రేఁగన్నులునడురే యెడకాలు మనుజనాథుఁడు రిపుఁ దానెడగాలఁ బెట్టె ననఁ బొలుపడక నుదాహరణము లగు నభినవదండీ. 111
వ. ఉత్తరపదార్థప్రధానం బెట్టి దనిన. 112
క. చలిగాడ్పు నల్లగలువలువలవంతలు తెల్లదమ్మి వలిక్రొవ్విరియెతైలమావిమోక జెంజిగురలరమ్ములు నాఁగ నివి యుదాహరణంబుల్. 113
క. అని యగు గుణిపిఱుఁద గుణంబనువుగ బోధించుచోట నది గాదే నట్ల నకార ముండు నల్లనికనుఁగవ యన నల్లగన్నుఁగవ యనఁ జనుటన్. 114
వ. అన్యపదార్థప్రధానం బెట్టి దనిన. 115
తే. చలివెలుఁగు వేఁడివెలుఁ గనఁ బులుఁగుపడగనలువ యన మచ్చెకంటి నా నలరువిల్తుఁ
డనఁగ వాతివాడియు జేతలాడి యనఁగఁదనరు నన్యపదార్థప్రధానచయము. 116
వ. ఉభయపదార్థప్రధానం బెట్టి దనిన. 117
ఆ. తల్లిదండ్రు లన్నదమ్ములు గూడ్కూరలెలమి నాలుబిడ్డ లెద్దుబండ్లుబంటుఱేఁడు లాటపాటలు నుభయప్రధానమునకు నివి యుదాహరణములు. 118
క. ధీనిధి గుణపదములపైమానుగ హల్లున్న నంతిమము లగు ములకున్బూని పునాదేశం బగుభూనుత పైనచ్చు లున్నఁబుట లగు ములకున్. 119
క. వాదపుఁబంతంబులును బ్రమోదపుశృంగారములును ముత్యపుసరులున్జూదపుటాటలు నెయ్యపుటాదరములు ననఁగ నివి యుదాహరణంబుల్. 120
ఆ. ఇల్లు కల్లు ముల్లు పల్లును విల్లునుకన్ను మున్ను వెన్ను చన్ను నాఁగఁబరఁగు శబ్దములకుఁ బైహలాదులతోడనదుకు నపుడు జడ్డ లడఁపఁ జెల్లు. 121
క. విలుకాఁ డిలువడి గలుపనిములుపొద పలువరుస లెస్స మునుగా ల్చనుముక్కులు గనుగొనలు వెనుస్రాపలవడు నని చెప్ప నివి యుదాహరణంబుల్.
తే. ఓలి రెండును మూఁడును నాలు గనఁగఁబరఁగుపదములఁ బట్టిన నిరు ము నలులుపొరయు ములమీఁద జడ్డలౌ నిరువదియునుముప్పదియు నలువదియు నా నొప్పుఁ గాఁగ.
క. తెనుఁగులఁ గొన్నిఁటిలో మునుకొని జడ్డలతోడ నిలిచి క్రొన్నెలు కృతికిన్బనివడి క్రొత్తయు నెఱయునుననుటఁ దెలియఁ జెప్పు వరుస నవి యెట్లనినన్.
క. క్రొన్నెల క్రొమ్మెఱుఁగులు నాఁగ్రొన్నన క్రొక్కారు నాఁగఁ గ్రొత్తమ్ములు నానెన్నడుము నెమ్మొగము నానెన్నడ నెత్తావి యనఁగ నెన్నుదు రనఁగన్.
క. తెలుఁగున కెంచెమ్ములు మునుగలవాక్యము లరుణకాంతి గావించును గెందలిరులు కెందమ్ములు నాఁజెలువుగఁ జెంగల్వ లనఁగఁ జెందొవలనఁగన్.
క. వే రనియెడుశబ్దం బేపారం దెనుఁగులకు మొదల నధికత దెలుపున్బేరాఁకలి పేరామనిపేరాముదపాకు లనఁగఁ బేరింపనఁగన్. 127
క. తన నా నీ యనుపలుకులనెనయంగ హలాదు లదుకునెడ దుఱ్ఱు నగున్తనదుధనము నాదుగుణంబన నీదుయశంబు నాఁగ ననువై యునికిన్. 128
క. నెరిఁ గులజులపై సరి దానెరయఁగ బహువచనషష్ఠి నిలుపఁగ నగుఁ గమ్మరిగడి మేదరిగడి కంచరిగడి మూసరితెఱంగునను ననఁ జనుటన్. 129
తే. పెక్కుసంస్కృతశబ్దంబు లొక్కపదముక్రిందఁ దద్విశేషణము లిం పొందఁ గూర్చితెలుఁగు తత్సమాసముక్రిందఁ గలుపునప్పుడగ్రపదముతో నిల నగు నర్థఘటన. 130
తే. తనవిశిష్టకులాచారధర్మ మనఁగఁదనజగద్గీతసాధువర్తన మనంగఁదనదిగంతరవర్తిప్రతాప మనఁగనివి యుదాహరణంబు లై యెందుఁ జెల్లు. 131
క. దినకరకొడుకునకును సరియనిమిష మొదవునకు సాటి యని యిబ్భంగిన్దెనిఁగింప సంస్కృతములందెనుఁగులు సంధించిరేనిఁ దెగడుదు రార్యుల్. 132
క. తెనుగుపదంబులపైఁ బెంపొనరఁగ సంస్కృతముచెల్లు నొక్కొకచోటన్మును సుకవీంద్రులు గృతులన్బనిగొని రచియించినట్టిపరిపాటిమెయిన్. 133
క. వాఁడిమయూఖము లనఁగావేఁడిపయోధార లనఁగా వింజామర నామూఁడస్త్రంబు లనంగాఁబోఁడిమిఁ గఱకంఠనామము న్బోలి తగున్. 134
క. నీ సంస్కృతంబుతోడ సమాసించును నీవినూత్నమణినూపురశబ్దాసక్తచిత్తహంసత్రాసకరాంబుదము నాఁగఁ దఱుచై యునికిన్. 135
క. ముదమున నా యీ యేలనుపదములతుద నూష్మ లుడుగఁ బైవర్ణముతోనదుకునెడఁ గుదియు సాగునుగుదియునెడన్ జడ్డవ్రా లగున్ బైహల్లుల్. 136
క. ఆకామిని యక్కామినియీకొడు కిక్కొడుకు నాఁగ నీయూ రియ్యూరేకార్యం బెక్కార్యంబాకథ యక్కథ యనఁగ నుదాహరణంబుల్. 137
వ. అనంతరంబ క్రియాపదంబు లెఱింగించెద. 138
క. ఇల నొరుఁడు నీవు నేనునునలిఁ జేసినపనులు క్రియలు నానావచనంబులు కాలత్రితయంబుననలవడి యీక్రియలు చెల్లు నభినవదండీ. 139
క. ఎన్నఁగ భూతార్థమునెడనెన్నగువర్తించునర్థ మెఱుఁగఁ బలుకుచోనున్నగు భవిష్యదర్థమునున్నంగాఁ బలుకుచోట నూతనదండీ. 140
క. ఒరులకు నెను నిరి యగును నెదిరికిఁ దివితికారములును దిరి యగుఁ దనకున్బరువడిఁ దినియున్ దిమియున్బొరయు నుభయవచనములకు భూతక్రియలన్. 141
క. పలికెను బలికి రనంగాఁబలికితివి పలికితి మఱియుఁ బలికితి రనఁగాఁ
బలికితిని బలికితి మనఁగనలఘుమతీ వరుసతో నుదాహరణంబుల్. 142
క. డును దరు లొరులకు నెదిరికిఁదనరంగా దు దవు దరులు తనకు దను దమున్జను నేకబహువచనములుమనుసన్నిభ క్రియల వర్తమానార్థములన్. 143
క. అడిగెడు నడిగెద రనఁగానడిగె దడిగెదవు ధనంబు నడిగెద రనఁగానడిగెద నడిగెద మనఁ బొల్పడరంగా వరుసతో నుదాహరణంబుల్. 144
క. ఉను దురు లొరులకుఁ జెప్పనుదనరఁగ దువు దురు లెదిరికిఁ దనకు దును దుముల్దనరఁగ నివి యేకబహువచనము లగు భవిష్యదర్థసంసూచకముల్. 145
క. పలుకును బలుకుదు రనఁగాఁబలుకుదువు పలుకుదు రనఁగఁ బలుకుదు నర్థిన్బలుకుదు మనఁగా నిన్నియునలఘుమతీ వరుసతో నుదాహరణంబుల్. 146
క. స్థావరతిర్యక్ప్రతతులకేవెరపునఁ గ్రియలు పొందు నేకవచనమున్
దేవమనుష్యాదిక్రియభావింపఁగ నేకవచన బహువచనంబుల్. 147
క. శిల గదలె శిలలు గదలెనుబులి గఱిచెం బులులు గఱిచె బోటి చనియె బోటులు చనిరి ముని యలరె మునులలరిరి నా వరుసతో నుదాహరణంబుల్. 148
క. ఉటపరపదములె క్రియ లగుచుటలొక్కెడ యుటలు వుటలు చుట్టంబులఁద్రోవుట ద్రోయుట యన చుటలున్బుటలును నగు సంస్కృతంబు పొందినచోటన్. 149
క. పుటచేతనైన నొరుఁ బంపుట చుటచే నైన నొరులఁ బుత్తెంచుట చేయుట యుటచే నగు నని యాపటుమతి యగునూత్నదండి ప్రకటముచేసెన్. 150
క. పలుకుట పలికించుటయునునలుగుట యలిగించుటయును నబలలు మదిలో
వలచుట వలపించుటయునుతలఁచుట తలపించుటయు నుదాహరణంబుల్.
క. అసమస్త లఘుద్వ్యక్షరలసితము లగు తత్సమంబులం జెప్పెడిచోపొసఁగు నియించుటయున్ గ్రియలసదృశ యించుటయె క్రియల నగు పెఱయెడలన్.
క. వరియించుటయు వరించుటతిరముగ నుతియించుటయు నుతించుట బలిమిన్బరు భంజించుటయును సంహరించుటయు వరుసతో నుదాహరణంబుల్.
తే. ప్రార్థనార్థంబుచోటను బ్రశ్నచోటసంశయం బుండుచోట నిశ్చయముచోటఁదెగడుచోటను నేత్వంబు తెనుఁగునందునోయొ లొందును సంశయం బొందుచోట.
క. పోవే వానలు గలవేనీవే ననుఁ బిలిచి తిపుడు నియతుం డతఁడేనీవు పొలియవే యమృతమొత్రావును విషమోయనఁగ నుదాహరణంబుల్.
క. ఎంచఁగ నేఁగుపదముతుదఁదెంచుట యగుఁ గ్రియల నరుగుదెంచుటపై కే
తెంచుట చనుదెంచుట నడతెంచుట తోతెంచు టనఁగఁ దెల్లం బగుచున్.
క. ఒకకర్త చేయుపనులకుఁబ్రకటితముగ మొదలయినపని యిత్వాంతంబకృతం బైనను కాంతంబకుటిల కర్తవ్యకార్య మన్వంత మగున్. 157
ఆ. ఆడఁబోయి చూచి యలిగెఁ బెట్టక త్రోచెవినక పలికె నియ్యకొనక చనియెకుడువ నేఁగె వేఁడుకొన నాసతో వచ్చెనన నుదాహరణము లయ్యెఁ గృతుల. 158
క. తినుటకును తింట యగు మఱికొనుటకుఁ గొంట యగుఁ గనుటకుం గంట యగున్వినుటకు వింట యగున్ దాననుటకు నంట యగు వలసినప్పుడు కృతులన్. 159
క. ఉటలకును వక లగు తెనుఁగుచటులకు వక లగును గదియుచో మును దాఁజేయుటకున్ జేయక మును ద్రోచుటకున్ ద్రోవక మునును బ్రచురమై యునికిన్. 160
క. దీవెన కెడమయుఁ గాతయుఁగావుతయున్ దెనుఁగుకవులకబ్బంబులలో
శ్రీవెలిఁగెడ మధిపుఁడు మేల్గావించుంగాత మేలుగావుత యనఁగన్. 161
తే. ఏపదముపైఁ గాఁడు నేర్పెల్లఁ దెలుపుగొనబుకాఁడు బలిమికాఁడు కొండెకాఁడుచనవుకాఁడు చెలిమికాఁడు జాడగాఁడుబందికాఁ డన నెల్లెడఁ బరఁగుచుండు. 162
ఆ. ఈఁడు బాస దెల్పు నీఁడు గుణము దెల్పునీఁడు కులము దెల్పు నెల్లయెడలఁగన్నడీఁడు నాఁగఁ గపటీఁడు నాఁగ సాలీఁడు నాఁగ వేరులేక చనుట. 163
క. ఇండి యనుట లే దనుటయెయొండొకయర్థంబు గలుగ నోపదు ధర ముక్కిండియు వెరవిండియు వ్రాయిండియు ముప్పిండి యనఁగ నేర్పడియునికిన్. 164
తే. ఆఁడు నరియును నధమకార్యములఁ దెలుపుబొంకులాఁడు తగవులాఁడు ఱంకులాఁడుపెంటిపెనపరి ముండరి తుంటరియునుగల్లరియు నన నెల్లెడఁ జెల్లుఁ గాన. 165
క. అమి లేమికి నిమి కల్మికినమరంగాఁ దనము ధర్మ మగుటకుఁ దగుఁ గా
నమి వినమి తాల్మి కూరిమితమమంచితనంబు లోభితన మనఁ జనుటన్. 166
క. ఆఁడును నీఁడును గత్తెయుఁగాఁ డనుచోఁ గర్త యగు జగం బెఱుఁగంగాబోఁడి యనఁగ నెల్లెడలనునాఁడుం బేళ్లకును జెల్లు నభినవదండీ. 167
క. అలికి రా లగు దిగువ గుణాలి నిలిపి పలుకుచోట నను వగునెడ గొడ్రాలు జవరాలు పాతకురాలు గెడపురాలు ముద్దరా లనఁ జనుటన్. 168
అ. అచ్చతెలుఁగుమాట నను వైనచో వకారము గకారరూప మమరఁ దోఁచుఁదీవె తీగె యనఁగ జేవ చేగ యనఁగఁబవలు పగలు నాఁగఁ బరఁగుఁ గాన. 169
తే. ఆతఁ డిట్టివాఁ డెట్టివాఁ డట్టివాఁడునాఁగఁ జనునట్టిత్రితయమునకుఁ గ్రమముననాతఁ డిట్టిఁడు నెట్టిఁడు నట్టిఁ డనఁగఁదగుల నిమ్మెయి నభినవదండి చేసె. 170
తే. అన్యుఁ బిలుచుచో నిడుద లౌ నక్షరములుకుఱుచ లై జడ్డముల మోదుఁ గొన్నియెడలఁ
కొడుక రా మఱి కొడుక పో కొడుక రమ్ముకొడుక పొ మ్మన జగతిలోఁ గూడుఁ గాన. 171
తే. అన్యుఁ బనుపుచో నుఱ్ఱంత మైనశబ్దమచ్చు పైనున్న ముఱ్ఱంత మగుట నిజముమొనసి పొడు వరిసేనల ననఁగఁ జనదుపొడువు మరిసేన ననుటయె పోలుఁ గాని. 172
తే. చునులపై నకారము పొడచూపుఁ బోవునొప్ప నచ్చులు పై డాసి యుండెనేనియొదవుచున్నచో నొదవుచునున్న చోటపొడుచుచడరెను బొడుచుచునడరె ననఁగ. 173
ఆ. అందు నిందు నెందు ననునర్థములు మఱియటయు నిటయు నెటయు నగుఁ గ్రమమునఁగ్రియలు రాక పోక లయి మీఁదనుండిననుతగుణాభిరామ నూత్నదండి. 174
క. అటపోయెడి నిటవచ్చెడినెటకరిగెడి ననుట యుచిత మిటువలెఁ గాదేనటయాడెడి నిటపాడెడినెటగూర్చున్నాఁ డనంగ నెసఁగవు గృతులన్. 175
క. సల్లలితైకపదముపైనిల్లు నిలును గ్రియలఁ గొన్నియెడలను దగ సంధిల్లుట శోభిల్లుటయుఁ బ్రభవిల్లుట యన జగతిలోన బెడఁ గై యుండున్.
క. మల్లెయు లంజెయు గద్దెయునొల్లెయు ననుపగిదిపలుకు లొప్పవుఁ గృతులన్మల్లియ లంజియ గద్దియయొల్లియ యని పలికి రేని యొప్పున్ గృతులన్.
క. ఱవ డవలపై వకారముకవియనుమతిఁ బోవు ఱడలు కడునిడుపు లగున్శివు మఱవండు మఱాఁడు గడవఁబలికెను వాఁడు శివు గడాఁ బలికె ననన్.
క. దూయుట దాఁగుట దొంగయుదాయుట యని చెప్పిరేని దనరును గృతులన్డూయుట డాగుట డొంగయుడాయుట యని చెప్పినను బెడంగగుఁగృతులన్.
క. ఇన భూతార్థముఁ దెలుపునుగనుఁగొనఁగాఁ గర్తృకరణకర్మంబులఁ బం
డినవాఁ డనఁ బొడిచినవాలనఁ బండినకొలుచు నాఁగ ననువై యునికిన్. 180
క. ఇనపై నుండునకారంబును పై వాఁ డనుపదంబు మొదలినకారంబును జడ్డనకారం బగుఁగనినాఁ డభిమతములోలిఁ గన్నాఁ డనఁగన్. 181
క. వినెఁ గనెఁ గొనె ననుపగిదిన్జనుపలుకుల నుండు నడఁగు సంబంధంబుల్వినియెఁ గనియెఁ గొనియె ననఁగననువై వర్తిల్లుఁ గాన నభినవదండీ. 182
క. మానుగ నఱ్ఱి ఱ్ఱంతములైనపదము లూఁదఁబలుక నగు నె ఱ్ఱుఱ్ఱంతానేకశబ్దజాలముదా నఱ్ఱంత మగు నూది తగఁ బల్కునెడన్. 183
క. దాతయె కల్పమహీజమునీతియె బ్రతుకునకుఁ దెరువు నిఖిలకళానిష్ణాతుఁడ మహాత్ముఁ డన నిట్లాతతముగఁ జెల్లుఁ గాన నభినవదండీ. 184
క. ఉత్తమగుణసూచక మగునెత్తమ్మియు నెమ్మొగంబు నెత్తావియు నానిత్తెఱఁగున రసికులు దమచిత్తము రుచియించుచోటఁ జెప్పుదు రొప్పన్.
క. పెక్కిటి కొకక్రియ యిడుచోనొక్కటఁ దుదినొండె మొదలనొండెను మఱి యొక్కొక్కటి కొండెను బెట్టుదురక్కట క్రియ నడుమఁ బెట్ట రాంధ్రకవీంద్రుల్.
క. కరి యరిగెఁ దురగ మరిగెనుగరియున్ దురగంబు నరిగెఁ గ్రక్కున నరిగెన్గరియును దురగము ననఁ దగుఁగరియరిగెన్ దురగ మనినఁ గైకొన రార్యుల్.
క. తీవెల మ్రాఁకులపేరులుపూవులకున్ బేళ్లు మొగలిపువ్వులు దక్కన్గ్రోవుల మల్లెలు జాజులుదా విరివాదు లని చెప్పఁ దగుఁ బెక్కులుగన్.
క. మానయు జేనయు లోనగునానాపరిమాణములు జనము గొలుచునెడన్
మానెఁడు జేనెఁడు ననుక్రియమాన కెఁడులనొందుమీఁద మ్రానయకేతా.
క. తెలుఁగు.............క్షణము భువి................దండి చెప్పె నభిథానములో...........................లన్నియుదెలియుఁడు సత్కవులు మేలు దేటపడంగన్.
క. తప్పులు దీర్పుడు కవులందొప్పులు గైకొనుడు దీనికోపనివారల్తప్పొప్పని వెడబుద్దులువిప్పకు డీయన్నలారవేడెద మిమ్మున్
ఆ. పాలునీరువేఱు పఱచునా కలహంసరీతిమ్రాన యార్యకేతనకవిఆంధ్రలక్షణంబు నలరంగనాచంద్రతారకంబుఁగాఁగఁ దా రచించె.