సీతారామాంజనేయసంవాదము

పరశురామపంతుల లింగమూర్తి

సీతారామాంజనేయమను నీ ప్రబంధము రచించినకవి పరశురామపంతుల లింగమూర్తి, ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు. రామమంత్రితిమ్మమాంబలకుమారుడు. ఇతనినివాసస్థలము నిజాము రాష్ట్రములోనివరంగల్లునకుఁ జేరిన మట్టివాడ. నేఁటివఱ కీకవివంశీయులు లింగమూర్తికవిపాదరజముచేబవిత్రీ కృతమైన ప్రాచీనగృహముననె వసించుచున్నారు. ఈ వంశమున నీయనకుఁ బూర్వము కవులున్నటులఁ దెలియదు. ఆంధ్రమున నీకవివర్యుఁడు రచించిన గ్రంథములఁ బేర్కొందుము.

1 రతిమన్మథవిలాసము2 జీవన్ముక్తి ప్రకరణము3 బ్రహ్మనారదసంవాదము4 తారక యోగము5 మానసశతకము (కందములు)6 సీతారామాంజనేయము.

ఇందు సీతారామాంజనేయము రతీమన్మథవిలాసము అనురెండు గ్రంథములెయించుక పెద్దవి. మిగిలిసకబ్బములు శతక ప్రాయములు.రతిమన్మథవిలాసము మూఁడాశ్వాసముల ప్రబంధము. ఈ గ్రంథము కవిబాల్యమున రచించినటుల నందలిభావలోపములు వ్యాకరణలోపములుసాక్ష్యము లగుచున్నవి. గద్యములో “శ్రీ మదాంజనేయచరణకమలసేవావిధేయ శృంగారకవితాచమత్కారధౌరేయ పరశురామపంతులలింగమూర్తినామధేయ ప్రణీతం బైనరతిమన్మథవిలాస మను శృంగారప్రబంధమందు” అని వ్రాసికొనియున్నాఁడు. దీనింబట్టి యౌవనముననీగ్రంథము కవి రచియించియుండునని తేలుచున్నది. సీతారామాంజనేయము లిఖించునప్పటికి కవిస్థితిగతులు మాఱెను. ఈతనిమానసము

శృంగారరసమునుండి విముఖమై వేదాంతరసమున నోలలాడఁ దొడగెను. కవితయు నిగ్గుతేఱిి వశంవదయై భావబింబముల నిర్జీవకథాంశములలో సైతము చిత్రించుశక్తి కల దయ్యెను. రతీమన్మథవిలాసముహనుమంతునకుఁ గృతి యీయఁబడినది, గద్యమున హనుమద్భక్తుఁడనని కవి చెప్పికొనెను. గ్రంథమున గురుప్రశంస లేదు. తుదకు స్వవంశవిషయమేని చెప్పికొనియుండ లేదు. సీతారామాంజనేయ మీకవి తనయుత్తరవయస్సున రచించియుండును. ఇందులకుఁ గవితాధారయువేదాంతపాండిత్యము మనకు దృష్టాంతములు కాగలవు. ఈకవి బాల్యమున సామాన్యునివలె విద్యాజ్ఞానశూన్యుఁడై తన గ్రామమగు మట్టివాడకు సమీపముననున్న ″ఈదులవాయ” యను గ్రామమున సంచరించుచుండ సమీపశైలమున వసించు మహాదేవయోగి యను నొకమహాత్యుడు రామమంత్రోపదేశ మొనరించె ననియు, నా గిరియందేయామంత్రరాజము సిద్ధించువఱకు వసించి యోగివలని సెలవంది యాయనదయ చేసిన షట్చక్రసీతారామస్వరూపము నిజగృహమునఁ బ్రతిష్ఠించెననియుఁ జెప్పుట యేకాక నేఁటివఱకు నాసీతారామమూర్తిస్వరూపమువంశీయులు భక్తితాత్పర్యములతోఁ బూజించుచున్నారు. కవి, తానుమహాదేవగురుశిష్యుఁడ ననియు షట్చక్రసీతారామోపాసకుఁడ ననియుసీతారామాంజనేయగద్యమున నిటుల “శ్రీమన్నారాయణ మహా దేవగురుకరుణా కటాక్షవీక్షణ విమలీకృత నిజహృదయకమల కర్ణికాంతస్సందర్శితాఖండ సచ్చిదానందరసైకస్ఫూర్తి షట్చక్ర సీతారామమూర్తిపరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి ప్రణీతము ” అని వ్రాసికొనియున్నాఁడు. మఱియు నీకవివర్యుఁ డార్జించిన శ్రీరాముమాడయుస్ఫటికవినాయకవిగ్రహము మరకతలింగము సాలగ్రామములు సైతమువంశీయులు శ్రద్ధాభక్తులతోఁ బూజించుచున్నారు. ఎట్టి విపత్కాలముననేని'తాఁ గడించినవిగ్రహముల మట్టివాడయందుంచియే పూజింపవలయునని కని యాజ్ఞ యొసంగెనఁట. నేటికి, వంశజు లటులె సల్పుచున్నారు. కవికి గురుమూర్తిపదము బిరుదనామము. ఇది యిక్కవి రామ

సీ. “అఖిలభూతంబుల నాడించుమాయనుసొంపుగా నెవ్వఁ డాడింపుచుండుగురుజనంబుల కెల్ల గురువులై తగుహరిహరుల కెవ్వఁడు గురు వగుచునుండువిబుధలోకంబుల వెలిఁగించి వెలుఁగులమించి యెవ్వఁడు వెలిగించుచుండు

ప్రభువుల కెల్ల సత్ప్రభు వైన బ్రహ్మకుఁబ్రభు వౌచు నెవ్వఁడు పరఁగుచుండు

గీ. సగుణ నిర్గుణరూపుఁడై నెగడుచుండునమ్మహాదేవగురువరు నభినుతింపసకలనిగమాగమాంతశాస్త్రంబు లోపవనఁగ మముబోంట్లకు నుతింప నలవి యగునె."

గీ. “అమ్మహాదేవగురుచరణారవిందపరపరాగాంశభజనతత్పరుఁడఁ బరశురామపంతులకులజాతరామమంత్రిమౌళితిమ్మాంబికాప్రియాత్మజుఁడ నేను. "

క."ప్రణవాత్మకసదసత్కారణసంపూర్ణప్రభాభిరామసగుణనిర్గుణ నిర్వికారనారాయణసీతారామగురుమహాదేవశివా."

సీ, "స్వామియై నిగమాలి భూమియై సురపురోగామియై యబ్ధిజాకామి యుండహారియై హలహలాహారి యై భవదంశుధారియై ప్రసవాయుధారి యుండవసుచరిత్రము, చతుర్థాశ్వాసము, ప, 36.

సీ. “ఏకమై పరమై విశోకమై సత్య మలోకమై వ్యాపకాలోక మగుచుసారమై చిదచిదాకారమై యతినిర్వేకారమై విగతసంసార మగుచు.........”సీతారామాంజనేయము, ఆ-2, ప-6.

ఉ. “హా యను గాధినందనమఖారినిశాటమదాపహారిబాహా యను గ్రావజీవదపదాంబురుహా యను రాజలోక సింహా యనుఁ బోషితార్యనిసహా యనుఁ గానల కేఁగితే నిరీహా యను నిర్వహింపఁగలనా? నిను బాసి రఘూద్వహా యనున్.”రామాభ్యుదయము. ఆ.5, ప-10.

ఉ. మాయను మిథ్యగాఁ దెలియుమా యను దత్కృత మెల్లఁ గల్లసుమ్మా యను మేను నే ననకుమా యను సాక్షిని నీవు చూచుకొమ్మా యనుఁ జూడఁగానితరమా యను నే నని నిశ్చయించుకొమ్మా యనుఁగాకపో నితరమా యనుమానము మానుమా యనున్.”సీతారామాంజనేయము, ఆ-3. ప.143 .

ఇట్లు భాషా సేవకులు,శేషాద్రి రమణకవులు, శతావధానులు,గంపలగూడెము శ్రీ కుమార రాజావారి ఆస్థానకవులు.

గంపలగూడెముకృష్ణాజిల్లా18-8-1917.