తెలుగువారి బృహత్సంహిత
సాక్షి మూడవ సంపుటం
"మల్లెపూవుదూఱి మధుపంబుతో బాడిగంధవాహుతోడ గలసి వీచియబ్ధిలోన మునిగి యౌర్వవహ్నిని గ్రాగికినీటి బుగ్గయగుచు నింగి బ్రాకితోకచుక్క తోడ డీకొని శ్రమజెందిసాంధ్యగార నదిని స్నానమాడితనువునిండ నింద్రధనుసు రంగులు పూసికైవారప్తు సుధను గైపుజెందిగోళగాన రుతికి మేళవింపు బాడిపాడియాడు యాడిపాడి సోలిభావనామహత్వ పటిమను బ్రహ్మమైపోవు కవికి కోటి మ్రొక్కులిడుదు"