పిచ్చివాని మరణశాసనము
సాక్షి మూడవ సంపుటం
“అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతినాయం లోకోస్తిన పరోనసుఖం సంశయాత్మనః"
గీ. తగిన కాలమందుఁ దగిన స్థలంబునందగిన రీతిఁ దగిన తరుణితగులవ్రేలుకుండలాల విద్వాంసుడైననుగక్కుఱితిని బడక కదలిపోడు.
పదము.చేతిలోనిగజ్జ యూతోయి నా దేవినడుముచుట్టు గోనెపాతమాతలందఱలోను మాతోయినారాణిఅడ్డునడకను గారుపీత.
కాలేన పంచత్వమితేషు కృత్స్నతోలోకేషు పాలేషు చ సర్వజంతుషుతమస్తదాసీర్గహనం గభీరంఅన్తస్యపారేభి విరాజతే విభుః"
క. లోకంబులు లోకేశులులోకస్టులు దెగినపిదప నలోకంబగు పెంజీఁకటికవ్వల సతతమునేకాకృతి వెల్గునతని నే సేవింతున్.