పురుష ప్రయత్నము
సాక్షి మూడవ సంపుటం
పదముదాసురాల రా రమ్మడియేన్ దాసీ నను మనిరే,భాసురాంగితిరుమంత్రము చెప్పెద పఠన సేయుమనిరే || గోవిందా ||ముద్రధారణముచేసెద మని పెద్దముసుఁగువైచినారేముసుఁగులోననా. హే హే హే!
సీ. ‘‘అంతంత మొగములై యంతంతఱొమ్ములైయంతంత యుదరంబు లైన వింతయాకారములతోడ నేకుముక్కలవలెఁబలుచపల్చని వెలవెలలతోడనిదురమబ్బులతోడ నిట్టూర్పుబుసతోడనీరుపట్టినకాళ్ల బూరతోడమెల మెల్ల నెదురీఁత యలపుల సొలపుతోగాజుకాయలబోలెఁ గానబడుచు
గీ. కుక్కగొడుగులవలె బుట్టి క్రుంగు మనముప్రాక్తనప్రకృతిగతి ప్రవాహ మడ్డుపఱతుమే? బుద్బుదములట్టు? పైన నూఁగియెటనొ టప్పన కుండ బ్రేలుటయె కాక.
గీ. వస్తు యాధార్ద్య మెఱుఁగక వస్తువునకునేదొ సంజ్ఞను మనముంచి యెరిఁగినటలల్లాడుదు మిది యంత యైంద్రజాలమందు దుముకులాడెడుబొమ్మలాట కాదె?
గీ. స్వప్నమునకంటె స్వప్నమై సత్యముగనుమాయకును మాయ యగుచు నమ్మకము గాంగశూన్యములకంటె శూన్యమై సుస్థిరముగఁగనఁబడెడు దీని నే మని యనఁగవచ్చు?